ప‌ద్మ‌విభూష‌ణుడిగా మెగాస్టార్ చిరంజీవి

January 26, 2024

ప‌ద్మ‌విభూష‌ణుడిగా మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి..భార‌త‌దేశంలో ఈ పేరు తెలీని వారుండ‌రు..ఆయ‌న నటనకు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభి మానులు ఉన్నారు. ఇప్పటికే లెక్క‌లేన‌న్ని అవార్డులను, ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకున్న చిరంజీవిగారు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు.

గత కొన్నిరోజులుగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా మెగాస్టార్ చిరంజీవిగారిని పద్మవిభూషణ్ వరించింది. సినీ అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం, క‌రోనా వంటి క‌ష్ట కాలంలో సినీ కార్మికుల‌కి అండ‌గా ఉండ‌డం, బ్ల‌డ్ బ్యాంక్ పెట్టి ల‌క్ష‌ల మందిని ప్రాణాపాయం నుండి కాపాడ‌డం వల్లే చిరంజీవిగారిని భార‌త‌దేశ రెండో అత్యున్న‌త పుర‌స్కారం ప‌ద్మ విభూష‌న్ ల‌భించింది.

1978 సంవత్సరంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టిన చిరంజీవి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ తన నటన, డ్యాన్స్, డైలాగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 2006 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ ను ఇవ్వగా ఇప్పుడు చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. 1987లో సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం గమనార్హం.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా బింబిసార ఫేమ్‌ మల్లిడి వశిష్ట 300కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Read Moreరాబిన్ హుడ్‌గా నితిన్‌..ఈ సారైనా హిట్ ద‌క్కేనా?

ట్రెండింగ్ వార్తలు