భీమా సినిమా నుంచి కొత్త పాట.. గల్లీ సౌండ్లతో దుమ్ము రేపుతుంది కదా!

February 22, 2024

భీమా సినిమా నుంచి కొత్త పాట.. గల్లీ సౌండ్లతో దుమ్ము రేపుతుంది కదా!

గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భీమా. ఈ సినిమాకి ఏ. హర్ష దర్శకత్వం వహించగా ప్రియ భవాని శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించనున్నారు. గోపీచంద్ ఈ సినిమాలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో చూస్తే ఇది ఒక మాస్ యాక్షన్ మూవీ లాగా కనిపిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ రఫ్ లుక్ తో చాలా సీరియస్గా కనిపిస్తున్నారు.

ఇప్పటికే ఒక పాట విడుదల చేసిన చిత్రబృందం తాజాగా రెండో పాటను విడుదల చేసింది. గల్లి సౌండ్లతో.. అనుకుంటూ సాగే ఈ పాట, సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్జ కి సంబంధించి ఉంటుంది. హీరో ఎలా ఉంటాడు అని వర్ణిస్తుంది ఈ పాట. రవి బస్రూర్, సంతోష్ వెంకీ కలిసి రచించిన ఈ పాటకి రవి బస్రూర్ సంగీతం ఇవ్వగా సంతోష్ వెంకీ తన గొంతును ఇచ్చారు. ఈ పాట చాలా మాస్ గా ఉంటుంది అని చిత్ర బృందం చెప్పారు.

మార్చి ఎనిమిదిన రాబోతున్న ఈ చిత్రం పైన ఇప్పటికే చాలామంది అభిమానుల కళ్ళు పడ్డాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ ఒక సీరియస్ పోలీసు ఆఫీసర్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా గోలీమార్ వంటి ఇంకో సినిమా గా మారుతుందేమో గోపీచంద్ కు మంచి కం బ్యాక్ పడుతుందేమో అని అభిమానులు వేయికనులతో ఎదురుచూస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు.

చాలా సంవత్సరాల నుంచి గోపీచంద్ కి మంచి హిట్ సినిమాలు ఏవీ పడలేదు. ఈ సినిమాకు నడుస్తున్న టాక్ బట్టి హిట్ వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా మీద చిత్ర బృందం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మళ్లీ గోపీచంద్ పోలీస్ అవతారంతో థియేటర్ల నిండా విజిల్స్ పడేటట్టే ఉన్నాయి. మరి ఈ సినిమా గోపీచంద్ కు కం బాక్ అవుతుందో లేదో తెలియాలంటే మార్చ్ 8 వరకు ఎదురుచూడాల్సిందే.

Read More: ఘనంగా ప్రియుడిని పెళ్లాడిన రకుల్.. ఫోటోలు వైరల్!

ట్రెండింగ్ వార్తలు