March 22, 2024
హీరో గోపీచంద్, డైరెక్టర్ రాధాకృష్ణ కాంబినేషన్లో వచ్చిన జిల్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. గోపీచంద్ కెరియర్ లోనే మోస్ట్ స్టైలిష్ గా కనిపించిన సినిమా ఏదైనా ఉందంటే అది జిల్ మాత్రమే. మళ్లీ వాళ్ల కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ రాధాకృష్ణ గోపీచంద్ కి కధ చెప్పగా గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటివరకు రాలేదు.
కానీ గోపీచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది. మరి గోపీచంద్ ఇమేజ్ కోసం రాధాకృష్ణ ఎలాంటి కథ రాసాడు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా గురించిన అప్డేట్స్ ఇప్పటివరకు ఏమి తెలియలేదు అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నదని సినీ వర్గాల సమాచారం. జిల్ కాంబినేషన్లో మళ్లీ వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ తెలియదు.
అలాగే హీరో నాగచైతన్య, విరూపాక్ష సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. విరూపాక్ష సినిమా హిట్ అవ్వటంతో మంచి ఫామ్ లో ఉన్న కార్తీక వర్మ విరూపాక్ష 2 సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో అక్కినేని నాగచైతన్య తో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనే విషయం ఎవరికీ తెలియదు.
నాగచైతన్య ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే అతనునటించిన తొలి వెబ్ సిరీస్ దూత మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చందు మొండేటి డైరెక్షన్లో,సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఆకర్షించింది. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Read More: ప్రభాస్ కి తన స్థాయి ఏంటో తెలియదు.. పృథ్వీ రాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!