గోపీచంద్, ‘భీమా’- కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

July 20, 2023

గోపీచంద్, ‘భీమా’- కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

మాచో హీరో గోపీచంద్, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా యూనిట్ ఈ చిత్రానికి సంబధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసింది. కాకినాడ, రాజానగరం, అద్దరిపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.

కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌లను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘భీమా’ రూపొందుతుంది.

ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ  యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

Read More: ‘బెదురులంక 2012′ కోసం ‘సొల్లుడా శివ’ అంటున్న కార్తికేయ

ట్రెండింగ్ వార్తలు