March 6, 2024
ఏ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం భీమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధ మోహన్ ఈ సినిమాని నిర్మించారు. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటించారు. మార్చి 8 మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కేకే రాధా మోహన్ చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ కథ లో కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి.
గోపీచంద్ గారు ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా చాలా కొత్త జోనర్ లో ఉండే కధ ఇది. తప్పకుండా ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అందరూ అనుకుంటున్నట్లు అఖండ సినిమాకి భీమ సినిమాకి ఏమాత్రం పోలిక లేదు. భీమాలో చూపించిన పరశురామ క్షేత్రం బెంగళూరు, బదామి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కధ అక్కడే జరుగుతుంది.శివాలయం అఘోరాలను యాంబియన్స్ కోసం చూపించాము అంతేకానీ కథతో అఘోరాలకు ఎలాంటి సంబంధం లేదు.
జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ. హర్ష చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు భీమా సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాని మంగుళూరు, బాదామి, ఉడిపి, మారేడుపల్లి, వైజాగ్ ఇలా చాలా డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేసాం. అన్నపూర్ణ లో ఒక భారీ టెంపుల్ కూడా క్రియేట్ చేసాము. ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని తీసి అనుకున్న క్వాలిటీని ఇవ్వగలిగాము. అన్ని ఏరియా ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాపై చాలా ఆసక్తి చూపించారు.
గోపీచంద్ గారి కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. ఓ టి టి సాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ చేసాం. ఇక హీరోయిన్లు ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మల పాత్ర లు డిఫరెంట్ గా ఉంటాయి. ప్రియ భవాని శంకర్ ది పూర్తిగా భిన్నమైన పాత్ర, ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కి చాలా ప్రాధాన్యత ఉంది. సినిమాకి అనుకున్న దానికన్నా రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు అన్నారు రాధామోహన్.
Read More: నీతులు చెబితే సరిపోదు తలైవా.. రజినిపై భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?