Bhimaa Twitter Review: మ్యాచో స్టార్ ఈజ్ బ్యాక్!

March 8, 2024

Bhimaa Twitter Review: మ్యాచో స్టార్ ఈజ్ బ్యాక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి గోపీచంద్ ఇటీవల కాలంలో నటించిన సినిమాలన్నీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన బీమా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చింది. ఇలా ఈ రివ్యూస్ అన్నీ కనుక చూస్తే గోపీచంద్ ఇస్ బ్యాక్ అని స్పష్టంగా తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఈయన ఒక హిట్ కొట్టారని తెలుస్తోంది.

గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో కెకె రాధామోహన్ నిర్మించారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఎ హర్ష‌తో దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాకి వచ్చినటువంటి ట్విట్టర్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.. ఎప్పటిలాగే యాక్షన్ ఎపిసోడ్‌‌తో అదరగొట్టాడని.. కామెడీ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని.. సెకండాఫ్ కాస్త రొటీన్ అనిపించిన క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందని తెలుస్తుంది.

వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి హీరోకి ఈ సినిమా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్‌లో సినిమాకి హైలైట్ అని.. యాక్షన్ ఎపిసోడ్‌లో భీమా శివతాండవం చేశాడని తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా ఈయన నటన మరో లెవల్ లో ఉంది. గోపీచంద్ కటౌట్ కి సరిపోయే సినిమా భీమా అంటూ ఎంతోమంది ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అంతేకాకుండా ఈ సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇవ్వడంతో ఇటీవల ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అంటూ ట్విట్టర్ లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

Read More: Gaami Movie Twitter Review: నేషనల్ అవార్డు పక్కా?

ట్రెండింగ్ వార్తలు