హరిహర వీరు మల్లు దర్శకుడు మారారా.. టీజర్ తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

May 2, 2024

హరిహర వీరు మల్లు దర్శకుడు మారారా.. టీజర్ తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయినటువంటి సినిమాలన్నింటిని కాస్త పక్కన పెట్టి రాజకీయాల పైన ఎక్కువ ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కమిట్ అయినటువంటి సినిమాలలో క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి సినిమా కొంతమేర షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళటంతో ఈ సినిమా షూటింగ్ పనులు కూడా కాస్త వాయిదా పడ్డాయి.

ఇకపోతే ఈ సినిమా దాదాపు మూడు సంవత్సరాలుగా షూటింగ్ పనులు జరుపుతూ వస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది .ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేసింది. ఈయన తప్పుకోవడంతో మరో కొత్త డైరెక్టర్ ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి..

ఇక ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఈ సినిమా టీజర్ అప్డేట్స్ గురించి విడుదల చేసినటువంటి పోస్టర్స్ లో ఎక్కడా కూడా డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడంతో ఈ విధమైనటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ కి సంబంధించినటువంటి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తో డైరెక్టర్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడమే కాకుండా ఈయనతో పాటు మరొక డైరెక్టర్ కూడా ఈ సినిమాకు పని చేయబోతున్నారని వెల్లడించారు.ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు దర్శకుడు జ్యోతి కృష్ణ వర్క్ చేయనున్నాడట. క్రిష్ ఆ బాధ్యతలు అతనికి అప్పగించాడు అని తెలుస్తుంది. ఇలా పోస్టర్లో ఇద్దరు పేర్లు ఉండడంతో డైరెక్టర్ విషయంలో అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.

Read More: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప.. పుష్ప సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందిగా?

ట్రెండింగ్ వార్తలు