July 4, 2022
మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన తారాగణంగా పుష్కర్ గాయత్రి దర్శక ద్వయం తెరకెక్కించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం 2017లో విడుదలై సంచలన విజయం సాధించింది. జాతీయ అవార్డులను సైతం కొల్లగొట్టింది ఈ గ్యాంగ్‌స్టర్– పోలీస్ డ్రామా. దీంతో ఈ సినిమా రీమేక్ హక్కల కోసం చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. ఫైనల్‌గా హిందీ రీమేక్ రైట్స్‌ను రియల్స్ ఎంటర్‌టైన్మెంట్‌వారు దక్కించు కున్నారు. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి చేసిన పాత్రలను హిందీలో ఎవరు చేస్తారు? అనే వార్తలకు బాలీవుడ్‌లో చాలామంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీని ఫైనల్‌గా హృతిక్‌రోషన్, సైఫ్‌అలీఖాన్ సెట్ అయ్యారు. ఇక ఓరిజినల్‌ను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. షూటింగ్ కూడా పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
కానీ ఇంతలో ఈ సినిమాను గురించి ఓ పుకారు తెరపైకి వచ్చింది. ‘విక్రమ్‌వేదా’ హిందీ రీమేక్‌కు బడ్జెట్ అనుకున్న దానికంటే డబుల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని లొకేషన్స్‌లో షూటింగ్‌కు హృతిక్‌రోషన్ నిరాకరించడం వల్లే ‘విక్రమ్ వేదా’ బడ్జెట్ పెరిగిందనేది బాలీవుడ్‌లో వినిపించిన పుకారు. కానీ ఈ విషయంపైమేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
‘‘విక్రమ్‌వేదా’ షూటింగ్ అనుకున్న ప్రకారమే జరిగింది. ఇండియాలోని డిఫరెట్‌లొకేషన్స్‌లో షూటింగ్ జరిపాం. ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నోలో కూడా షూటింగ్ జరిపాం. 2021 అక్టోబరు– నవంబరులో మాత్రం యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లొకేషన్స్‌లో షూటింగ్ జరిపాము. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే బయోబబుల్ ఎన్విరాన్మెంట్‌లో షూటింగ్ చేశాం’’ అని ఓ స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌చేశారు మేకర్స్. ఇదేదో. .ఉత్తరప్రదేశ్‌లో హృతిక్‌రోషన్ ఉన్న వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేస్తే మరింత క్లారిటీ వచ్చి ఉండేది అన్నది సినీ లవర్స్ మాట మరి