హీరోలందరి తో సినిమాలలోనూ నటించాను, కానీ నా జీవితం ఇలా…

March 12, 2024

హీరోలందరి తో  సినిమాలలోనూ నటించాను, కానీ నా జీవితం ఇలా…

సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్టులుగా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం వయసు పై పడటంతో సినిమా అవకాశాలు లేక ఎంతో మంది ఆర్టిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇలాంటి వారిలో నటి పావలా శ్యామల ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా నటించి సందడి చేశారు.

ఇలా ఒకప్పుడు ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపే ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడమే కాకుండా వయసు మీద పడినటువంటి తరుణంలో ఉండటానికి కూడా నీడ లేకుండా ఒక వృద్ధాశ్రమంలో జీవనం గడుపుతున్నారు. ఈమెతో పాటు అనారోగ్యానికి గురైన తన కుమార్తె బాగోగులను కూడా చూసుకుంటూ గతంలో ఆస్తులన్నింటినీ కూడా అమ్ముకున్నారు.

చివరికి తనకు వచ్చిన అవార్డులన్నింటినీ కూడా అమ్ముకొని ఆ డబ్బుతో జీవనం గడిపినటువంటి పావలా శ్యామల దుస్థితి మరింత దీనంగా మారింది. దీంతో ఈమె దీన పరిస్థితి చూసి పలువురు సెలబ్రిటీలు తనకు ఆర్థికంగా సహాయం అందించారు. అయితే తాజాగా ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పావల శ్యామల మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ అక్కడున్నటువంటి వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి.

ఈ సందర్భంగా పావలా శ్యామల మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించాను ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాను నాకు 58 సార్లు సన్మాన కార్యక్రమాలు చేశారు అయితే ప్రస్తుతం తన పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని తెలిపారు. వచ్చిన అవార్డులన్నీ కూడా అమ్ముకొని జీవనం గడుపుతున్నానని తెలిపారు..

ఇక ప్రస్తుతం తాను నా కష్టాలను మీ అందరికీ చెప్పుకోవడానికి రాలేదని, నేనెప్పుడూ పోతానో కూడా తెలియదు అందుకే బ్రతికున్నప్పుడు మీ అందరిని ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More : సక్సెస్ కోసం వేణు స్వామిని కలిసిన హీరోయిన్

ట్రెండింగ్ వార్తలు