డైరెక్టర్ సూర్య కిరణ్ మరణానికి అసలు కారణం ఇదేనా

March 12, 2024

డైరెక్టర్ సూర్య కిరణ్ మరణానికి అసలు కారణం ఇదేనా

సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సూర్య కిరణ్ అకాల మరణం అందరిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈయన బాల నటుడిగా కెరియర్ ప్రారంభించి అనంతరం ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి గుర్తింపు పొందారు. సత్యం సినిమా ద్వారా డైరెక్టర్ గా మారినటువంటి సూర్య కిరణ్ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇలా ఈయన సినిమాలకు దూరంగా ఉంటూ ఏం చేస్తున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు కానీ ఈయన అకాల మరణం ఒక్కసారిగా అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఈయన జాండీస్ రావడంతోనే చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు కానీ ఈయన మరణానికి మరో కారణం ఉంది అంటూ తాజాగా సినీ నటి కరాటే కళ్యాణి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ సూర్యకిరణ్ మరణం తనని దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అయితే ఈయన మరణించడానికి కారణం తన భార్య హీరోయిన్ కళ్యాణి అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కళ్యాణి డైరెక్టర్ సూర్య కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ భారీ స్థాయిలో సినిమాలను నిర్మించి అప్పులు పాలు కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా కళ్యాణి విడిపోయినప్పటి నుంచి తనని ఎంతో ప్రేమించినటువంటి సూర్యకిరణ్ ఆ విషయాన్ని తలుచుకుంటూ పూర్తిగా మద్యం సిగరెట్లకు బానిస అయ్యారని తెలిపారు. ఇలా ప్రతిరోజు రాత్రి అంతా తాగుతూ ఉంటే ఎవరి ఆరోగ్యమైన ఎలా సహకరిస్తుంది. దాంతో తనకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా కరాటే కళ్యాణి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Read More :  అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభించిన ఉపాసన..

 

ట్రెండింగ్ వార్తలు