అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభించిన ఉపాసన..

March 12, 2024

అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభించిన ఉపాసన..

ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మెగా ఇంటి కోడలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా మెగా ఇంటికోడలుగా మాత్రమే కాకుండా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన ఒకవైపు ఇంటి బాధ్యతలను ఇంటి కీర్తి ప్రతిష్టలను పెంచుతూ కోడలిగా గుర్తింపు పొందుగా మరోవైపు ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈమె తన అత్తయ్య పేరు మీదట అత్తమ్మ కిచెన్ అని బిజినెస్ ప్రారంభించి ఉత్తమ కోడలుగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈమె చేస్తున్నటువంటి మంచి పనికి పుట్టినింటి కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి.

ఉపాసన తాజాగా తన తాతయ్య అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డితో కలిసి అయోధ్య వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ బాల రామయ్యను దర్శించుకున్నటువంటి ఈమె అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో భేటీ అయినటువంటి ఉపాసన అయోధ్యలో తాను అపోలో హాస్పిటల్ సేవలను కొనసాగించబోతున్నారని అందుకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు. అంతేకాకుండా తన తాతయ్య బయోపిక్ అయినటువంటి ది అపోలో స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా యోగి ఆదిత్యనాథ్ కి అందజేశారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో అపోలో హాస్పిటల్స్ ఉండగా తాజాగా ఈమె అయోధ్యలో కూడా అపోలో సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఎమర్జెన్సీ కేసులకు ఫ్రీగా సర్వీస్ చేస్తానని ఈమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలను తెలియజేస్తూ ఉపాసన సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉపాసన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులకు ఫ్రీగా సేవలు అందించడం అంటే ఎంతో గొప్ప నిర్ణయం అని పలువురు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More :  ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

 

ట్రెండింగ్ వార్తలు