ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ మధ్య చెడిందా!.. కారణాలు ఇవేనా?

December 24, 2023

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ మధ్య చెడిందా!.. కారణాలు ఇవేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా, అన్నదమ్ములుగా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఒకరు. వీరిద్దరూ కూడా నందమూరి హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం కూడా ఉందని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (NTR-Kalyan Ram) సినిమా ఈవెంట్లకు పెద్ద ఎత్తున హాజరవుతూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ సైతం ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరిద్దరు దూరంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. మరి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్(NTR-Kalyan Ram) గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఇదివరకు కళ్యాణ్ రామ్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే వారు కానీ డెవిల్ సినిమాకు మాత్రం ఈయన హాజరు కాలేదు. ఈ సినిమా ఈవెంట్ ముందుగానే తెలిసినప్పటికీ ఎన్టీఆర్ టూర్ ప్లాన్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే వెళ్లారని తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టులు కూడా చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం దేవర సినిమా అనే సమాచారం దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం తెలియాల్సి ఉంది.

Read MoreGame Changer: గేమ్ చేంజర్ విడుదల.. దిల్ రాజు వల్ల అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు