ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వడానికి ఆ అవమానమే కారణమా.. ఏమైందంటే?

February 19, 2024

ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వడానికి ఆ అవమానమే కారణమా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగుపెట్టినటువంటి ఎన్టీఆర్ అనంతరం హీరోగా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.మాస్ యాక్షన్ మూవీ అయినా కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగే సినిమా అయినా ఎన్టీఆర్ ఎంతో అవలీలగా ఆ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఎలాంటి కష్టమైనా డైలాగ్స్ అయిన ఈయన సింగిల్ టేక్ లో పూర్తి చేస్తారు.

ఈ విధంగా ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాకుండా ఈయనలో సింగర్ కూడా దాగి ఉన్నారని ఎంతో అద్భుతంగా పాటలను పాడుతారని అలాగే ఎంతో అద్భుతంగా డాన్సులు కూడా చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్టీఆర్ డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఇలాంటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి రావడానికి అందరి ముందు తనకు జరిగిన అవమానమే కారణమని తెలుస్తోంది.

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు పెళ్లికి హరికృష్ణ శాలిని అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా తీసుకువెళ్లారట, ఇలా వీరు ఆ పెళ్ళికి వెళ్లడంతో సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు ఈ పెళ్లికి వస్తున్నారు. అలాంటిది నువ్వు వీరిని ఎందుకు పెళ్లికి తీసుకువచ్చావు అంటూ సీనియర్ ఎన్టీఆర్ అరవడంతో హరికృష్ణ చేసేదేమీ లేక తన భార్య శాలిని జూనియర్ ఎన్టీఆర్ ను ఆటోలో తిరిగి వారి ఇంటికి పంపించేసారట. అప్పటినుంచి మాకంటూ ఒక గౌరవం రావాలి అంటే ఎన్టీఆర్ మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో శాలిని తనకు నటనలోనూ డాన్స్ లోను ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారని అలా అవమానం కారణంగానే నేడు ఎన్టీఆర్ ఈ స్థాయిలో సక్సెస్ అందుకున్నారని తెలుస్తోంది.

Read More: డబ్బు కోసమే అవమానాలు పడ్డాను..అలా హేళన చేశారంటూ వైవా హర్ష ఎమోషనల్!

ట్రెండింగ్ వార్తలు