లైగ‌ర్‌లో మైక్ టైస‌న్ పాత్ర చిత్రీక‌ర‌ణ పూర్తి

November 30, 2021

లైగ‌ర్‌లో మైక్ టైస‌న్ పాత్ర చిత్రీక‌ర‌ణ పూర్తి

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `లైగర్`. ఈ చిత్రంతో అమెరిక‌న్ ఫేమ‌స్ బాక్స‌ర్‌ మైక్ టైసన్ ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ రోజు యూఎస్‌లో ఆయ‌న పాత్ర‌కి సంభంధించిన షూటింగ్ పూర్తిచేశారు. దీంతో లైగ‌ర్ టీమ్ యూఎస్ షెడ్యూల్ పూర్తిచేసుకుని ఇండియాకు ప‌య‌న‌మైంది. ఈసంద‌ర్భంగా మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించారు. ఆయ‌న‌తో షూటింగ్ స‌జావుగా సాగింది అంటూ షూటింగ్ లొకేష‌న్ నుండి కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ఫోటోల‌లో మైక్‌టైస‌న్ భార్య కికి ని కూడా చూడొచ్చు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ తో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుద‌ల కానుంది.

  

ట్రెండింగ్ వార్తలు