Jai Hanuman: ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌కు మించి ‘జై హనుమాన్’ ఉంటుంది: ప్రశాంత్‌ వర్మ.

March 4, 2024

Jai Hanuman: ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌కు మించి ‘జై హనుమాన్’ ఉంటుంది: ప్రశాంత్‌ వర్మ.

తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమా హనుమాన్. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో దిగి చాలా పెద్ద సక్సెస్ ని అందుకుంది. టాలీవుడ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇప్పటికీ అనుమాన్ సినిమా చాలా చోట్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అందుకే ఈ సినిమాకి 50 రోజుల వేడుకను స్పెషల్ గా నిర్వహించారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని మేకర్స్ కన్ఫామ్ చేసి ఆ విషయాన్ని అనౌన్స్ కూడా చేశారు.

గత కొన్ని వారాల క్రితమే ఈ సినిమా పనులు కూడా స్టార్ట్ చేయగా ఆడియన్స్ కి సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జై హనుమాన్ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారు. హనుమాన్ సినిమా 50 రోజుల పండుగ వేడుకలో మాట్లాడుతూ జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని అప్పుడే ఫస్ట్ లుక్ పై కూడా అప్డేట్ ఇచ్చేసాడు.

ఇక హనుమాన్ సక్సెస్ గురించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఒక సినిమా వారం రోజులు ఆడటమే గొప్ప, అలాంటిది హనుమాన్ మూవీ 150 థియేటర్లలో 50 రోజులు ఆడింది హనుమాన్ సినిమా. ఇది చిన్న విషయం కాదు మాకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. సరైన కంటెంట్ తో సినిమా తీస్తే ఇప్పుడు కూడా 50 రోజులు, వంద రోజులు సినిమా ఆడతాయని ఒక నమ్మకం, కొత్త వాళ్ళకి ఒక హోప్ ఇచ్చేందుకే ఈ ఈవెంట్ ని పెట్టాము.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది చాలా పెద్దది. ఇందులో భాగంగా మొదటి సినిమానే హనుమాన్. 20 ఏళ్లలో మేము చేయాలనుకున్నదంతా ఐదేళ్లలోనే పూర్తి చేయటానికి సిద్ధమవుతున్నాము. త్వరలోనే చాలా క్వాలిటీస్ తో సినిమాటిక్ యూనివర్స్ నుంచి చిత్రాలని రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.

Read More: Pushpa2: ఎన్నో బాధ్యతలుంటాయి.. ‘పుష్ప2’లో పాత్రపై రష్మిక కామెంట్స్‌!

ట్రెండింగ్ వార్తలు