#JaiHanuman: జీవితాంతం గుర్తుంచుకునే చిత్రాన్ని అందిస్తాన‌ని మాటిచ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌

April 17, 2024

#JaiHanuman: జీవితాంతం గుర్తుంచుకునే చిత్రాన్ని అందిస్తాన‌ని మాటిచ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సెషన్ క్రియేట్ చేసిన మూవీ `హనుమాన్`. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‏గా రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‏లోనే జై హనుమాన్ పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. అంతేకాకుండా ఈ మూవీలో హ‌నుమంతుని పాత్రను కూడా రివీల్ చేయనున్నారు. దీంతో హనుమాన్ పాత్రలో కనిపించే స్టార్ హీరో ఎవరంటూ సందేహాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు అడియన్స్. జై హనుమాన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ?.. కొత్తగా జాయిన్ అయ్యే నటీనటులు ఎవరెవరు అని ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రాముడికి హనుమంతుడు ప్రమాణం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్రేక్షకులకు మాటిస్తున్నట్లు తెలిపారు.

‘ఈ పవిత్రమైన రోజు సందర్భంగా శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మాటిస్తున్నాను. మునుపెన్నడు లేని అనుభూతిని.. జీవితకాలం గుర్తుంచుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తానని.. ఈసారి మనందరికీ మరింత ప్రత్యేకం కానుంది’ అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

Read More: బాడీ షేమింగ్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్ ప్రియమణి?

ట్రెండింగ్ వార్తలు