అయోధ్య రామ మందిరానికి కోట్లలో విరాళం.. ప్రకటించిన హనుమాన్ టీమ్!

February 9, 2024

అయోధ్య రామ మందిరానికి కోట్లలో విరాళం.. ప్రకటించిన హనుమాన్ టీమ్!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా కోసం కొనుగోలు చేసే ప్రతి ఒక్క టికెట్ నుంచి ఐదు రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా ఈ సినిమా టికెట్లు కొనుగోలు చేసి సుమారు 10 20 లక్షల దాకా రామ మందిరానికి పంపిస్తారని అందరూ భావించారు.

హనుమాన్ సినిమా ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడం విశేషం. ఇటీవల మేకర్స్ ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంటూ అధికారకంగా తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి విరాళం గురించి హనుమాన్ టీం అధికారకంగా ప్రకటించారు.

సినిమా సెన్సేషన్ గా మారడంతో రూ. 2,66, 41,055 అయోధ్య రామ మందిర్ కి డొనేట్ చేశారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇలా రెండు కోట్లకు పైగా స్వామి మందిరానికి విరాళం ప్రకటించినప్పటికి హనుమాన్ టీం కార్యక్రమాన్ని మానుకోకుండా ఇంకా స్వామి వారి మందిరానికి విరాళాలు పంపిస్తూనే వచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా రూ.5 కోట్ల వరకు డొనేట్ చేసినట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించారు.

ఇలా అయోధ్య రామ మందిరానికి భారీ స్థాయిలోనే హనుమాన్ నుంచి విరాళం అందిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా కూడా అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేసుకుంది. హనుమాన్ మంచి సక్సెస్ కావడంతో జై హనుమాన్ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి.

Read More: ఆ నమ్మకం లేకపోతే సినిమా తీసి ప్రయోజనం ఉండదు : షాహిద్ కపూర్

ట్రెండింగ్ వార్తలు