Hanuman OTT: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

March 18, 2024

Hanuman OTT: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చిత్రాలలో హనుమాన్ సినిమా ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వారిలో తేజ సజ్జా ఒకరు. ఈయన హీరోగా ఇదివరకే పలు సినిమాలలో నటించారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా  ద్వారా తేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది . ఇక ఈ సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎన్నో సవాళ్లను ఎదిరిస్తూ పెద్ద సినిమాలకు పోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా సంచలనం అయినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు డిజిటల్ మీడియాలో మాత్రం ప్రసారం కాలేదు అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ మీడియాలో అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 లో ఆదివారం మార్చి 17 ఉదయం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్‌ శనివారం మార్చి 16 రాత్రి నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇలా థియేటర్లలో సంచలనం అయినటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీలలో విడుదల కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దేశ వ్యాప్తంగా ఏకంగా 350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. జై హనుమాన్ అనే పేరిట ఈ సినిమా సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Read More: ఎలక్షన్ ఎఫెక్ట్..వాయిదా బాటలో కల్కి నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు