దేవర సినిమాపై జాన్వీ కపూర్ వైరల్ కామెంట్స్.. మూవీ పై మరిన్ని అంచనాలు!

February 23, 2024

దేవర సినిమాపై జాన్వీ కపూర్ వైరల్ కామెంట్స్.. మూవీ పై మరిన్ని అంచనాలు!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ సినిమాకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చింది. ఈ సినిమాలో సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అదే సమయంలో దేవర మూవీ షూటింగ్ తనకు కొత్త అనుభవాన్ని అందించిందని, ఈ సినిమాలో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు.

ప్రతి సీన్ గురించి ముందుగానే తెలుసుకున్నానని ఆమె కామెంట్స్ చేశారు. అలాగే అనిరుద్ వల్ల దేవర మూవీ ఆలస్యం అవుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదంటూ చెప్పకనే చెప్పింది జాన్వీ కపూర్. తాను ఇంకా ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నానని, ఈ సినిమా షూటింగ్ ని తాను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. దసరా పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉండబోతుందని సమాచారం. టీజర్ లేదా ట్రైలర్ విడుదలయితే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ వర్గాల వారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండబోతున్నాయని ఫాన్స్ అంచనాలకు మించి సినిమా ఉంటుందని..

సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకు వెళ్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ దేవర సినిమాతో పాటు మరొక భారీ బడ్జెట్ తెలుగు మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు హిట్ అయితే కచ్చితంగా తల్లి శ్రీదేవిలా జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్ లో తిరుగులేని తారగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

Read More: అనసూయ టఫ్ గర్ల్.. రచయిత ప్రసన్నకుమార్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు