ఐటమ్ సాంగ్స్ పై సమంత కామెంట్స్!

March 16, 2024

ఐటమ్ సాంగ్స్ పై సమంత కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సమంతకు అనారోగ్య సమస్యలు రావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినటువంటి సమంతా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈమెకు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ క్రమంలోనే స్పెషల్ సాంగ్స్ గురించి కూడా సమంతకు ప్రశ్నలు ఎదురయ్యాయి సమంత స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఊ అంటావా పాటకు అద్భుతమైన స్టెప్పులు వేశారు ఈ పాట ఎంతలా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇక ఈ స్పెషల్ సాంగ్స్ గురించి సమంతను ప్రశ్నిస్తూ…ఇకపై ఇలాంటి సాంగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ ఇకపై ఇలాంటి పాటలు అసలు చేయనని తెలిపారు.

ఊ అంటావా మొదటి షాట్ లో నేను వణికిపోయాను. ఎందుకంటే సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. కానీ అలాంటి అసౌకర్యమైన, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా నేను ఈ స్థాయికి వచ్చానని సమంత వెల్లడించారు. ఇక మాయోసైటిస్ గురించి బయట పెట్టడానికి కారణం ఉందని ఈమె తెలియజేశారు. ఆ సమయంలో యశోద సినిమా రిలీజ్ అవుతుందని కానీ ప్రమోషన్లకు రాకపోవడంతో నా గురించి ఎన్నో వార్తలు వచ్చాయి ఆ పుకార్లకు అడ్డుకట్టు వేయడం కోసమే తాను ఈ విషయాన్ని బయట పెట్టానని సమంత తెలిపారు.

Read More: బిగ్ బాస్ ఆది రెడ్డి కొత్త ఇంటిని చూశారా?

ట్రెండింగ్ వార్తలు