August 17, 2022
నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ -2 ఆగస్ట్ 13న రిలీజై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కాశ్మీర్‌ఫైల్స్ నిర్మాతలు కావడంతో నార్త్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓవర్‌సిస్ లో హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఓ మోస్తారు అంచనాలతో రిలీజైన కార్తికేయ 2 మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతోనే జనాల్లోకి వెళ్లింది. భగవంతుడు, సైన్స్ రెండిటిని కలిపి రాసుకున్న కార్తికేయ 2 కథ ఈ సినిమాకు మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. అలాగే సెంకండాఫ్ లో అనుపమ్ ఖేర్ కృష్ణతత్వం గురించి చెప్పే డైలాగ్స్ ఆడియన్స్‌కి గూజ్‌బంమ్స్ తెప్పిస్తాయి. కృష్ణ కంకణ విశిష్టత, దాన్ని సాధించడానికి పడే శ్రమను చక్కగా చూపించారు దర్శకుడు చందు మొండేటి అయితే పలుచోట్ల నాసిరకం గ్రాఫిక్స్, లాజిక్స్ మిస్ అవడం సినిమాకు డ్రా బ్యాక్స్ అని చెప్పొచ్చు.