నిఖిల్‌ను ఏడిపిస్తున్న నిర్మాత ‘దిల్‌’ రాజు

July 3, 2022

నిఖిల్‌ను ఏడిపిస్తున్న నిర్మాత ‘దిల్‌’ రాజు

నిఖిల్‌ హీరోగా నటించి థియేటర్స్‌లో రిలీజైన చివరి చిత్రం ‘అర్జున్‌ సురవరం’. తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘కణితన్‌’కు తెలుగు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం 2019లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్‌ హీరోగా నటించిన మరో సినిమా వెండితెరపైకి రాలేదు. ఇంతలో కరోనా రావడం వల్ల ఇది మరింత ఆలస్యం అయ్యింది.

ఈ లోపు నిఖిల్‌ కష్టపడి ‘కార్తికేయ 2’, ‘ 18 పేజేస్‌’, ‘స్పై’ సినిమాలను చేశారు. ‘18 పేజేస్‌’ ఆగస్టులో, ‘స్పై’ చిత్రం దసరా రిలీజ్‌కు షెడ్యూల్‌ అయ్యాయి. అయితే ‘కార్తికేయ 2’ సినిమాను జూలై 22న రిలీజ్‌ చేస్తున్నట్లుగా నిఖిల్‌ ఎప్పుడో ప్రకటించారు. కానీ జూలై 8న రిలీజ్‌ కావాల్సిన నాగచైతన్య ‘థ్యాం క్యూ’ సినిమాను జూలై 22కు వాయిదా వేశారు ఈ చిత్ర నిర్మాత ‘దిల్‌’ రాజు. అయితే ఇప్పుడు తనకు సోలో రిలీజ్‌ కావాలని, ‘కార్తికేయ 2’ రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని నిఖిల్‌పై థ్యాంక్యూ సినిమా నిర్మాత ‘దిల్‌’ రాజు ఒత్తిడి చేస్తున్నాడు.

ఇప్పటికే ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘కార్తికేయ2’ను వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు రిలీజ్‌ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నిఖిల్‌ అల్లాడిపోతున్నాడు. ఇలా ప్లాన్‌ మార్చుకుని ‘దిల్‌’ రాజు వంటి పెద్ద నిర్మాత నిఖిల్‌ వంటి మీడియం రేంజ్‌ హీరోని ఇబ్బంది పెట్టడం సరికాదని ఇండస్ట్రీలో మాట్లాడు కుంటున్నారు. మరి..ఫైనల్‌గా జూలై 22న ‘థ్యాంక్యూ’, ‘కార్తికేయ 2’ చిత్రాల్లో ఏదీ ఆడియన్స్‌ ముందకు వస్తుందో చూడాలి. లేకపోతే రెండు వస్తాయా? లేట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ

ట్రెండింగ్ వార్తలు