September 13, 2022
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం `కార్తికేయ 2` (Karthikeya 2). చందూ మోండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన సౌత్, నార్త్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో నార్త్‌లోనూ నిఖిల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీప్రియులు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ భారీ ధరకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. గత వారంతో థియేటర్ రన్ పూర్తయ్యింది. ఇక సెప్టెంబర్ 30 నుంచి జీ5లో కార్తికేయ 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు.