రాజమౌళికి షాక్ ఇచ్చిన సన్ రైజర్స్ టీమ్.. మహేష్ న్యూ లుక్ ని రివీల్ చేసేసారుగా?

April 23, 2024

రాజమౌళికి షాక్ ఇచ్చిన సన్ రైజర్స్ టీమ్.. మహేష్ న్యూ లుక్ ని రివీల్ చేసేసారుగా?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర బృందం ఇవ్వలేదు దుబాయ్ కి కూడా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.. మామూలుగా రాజమౌళి సినిమా అంటే ఆయన పెట్టి కండిషన్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. పొరపాటున కూడా చిన్న లీకులు విడుదల చేయడానికి ఆయన ఇష్టపడరు.

సినిమా పూర్తయ్యే వరకు కూడా చిన్న చిన్న లీకులు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఈసారి రాజమౌళి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా లేదు. ఎందుకంటే రాజమౌళితో సినిమా స్టార్ట్ అవ్వకముందే మహేష్ బాబు లుక్స్ లీక్ అయ్యాయి. మొదటి మొన్న ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు లుక్ వైరల్ గా మారగా తాజాగా మహేష్ బాబు లుక్ కి సంబంధించి మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మహేష్ బాబు రీసెంట్ గా సన్‌రైజర్స్ టీమ్ ను కలిశారు. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ ని కలుసుకున్నారు మహేష్. మొన్నటి వరకూ సమ్మర్ వెకేషన్ కొరకు యూరప్ లో ఉండి వచ్చిన ఉన్న మహేష్ రీసెంట్ గా హైదరాబాద్ తిరిగి వచ్చారు.

అయితే మహేష్ తన నెక్స్ట్ సినిమాని రాజమౌళితో చేస్తుండడంతో బయట పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా తలకి క్యాప్ పెట్టుకొని తన లుక్స్ ని కొంచెం కవర్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో మహేష్ బాబు లుక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ లీక్ చేసారు. మహేష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ ని కలుసుకున్నారు. వారితో కలిసి టీమ్ ప్రమోషనల్ షూటింగ్ ఏదో చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయంలోనే సూపర్ స్టార్ తో ఫోటో దిగిన కమ్మిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ తో అంటూ రాసుకొచ్చారు. అయితే మహేష్ బాబు న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోని చూసినా కొంతమంది అయ్యో రాజమౌళి కండిషన్స్ రూల్స్ బ్రేక్ అయినట్టేనా, ఆయన అనుమతి లేకుండా మహేష్ బాబు లుక్స్ ని రివ్యూ చేసేసారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: లోకేష్ కనగరాజ్ సినిమాలో కూలిగా రజినీకాంత్.. టైటిల్ టీజర్ అదిరిపోయిందిగా?

ట్రెండింగ్ వార్తలు