జై హ‌నుమాన్ స్క్రిప్ట్ వ‌ర్క్ ప్రారంభించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌..

January 23, 2024

జై హ‌నుమాన్ స్క్రిప్ట్ వ‌ర్క్ ప్రారంభించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌..

ఈ ఏడాది సంక్రాంతికి గ‌ట్టి పోటీ మ‌ధ్య విడుద‌లైన హ‌నుమాన్ సంక్రాంతి భ‌రిలో దిగిన అంద‌రి హీరోల‌కి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది యూనామిన‌స్‌గా సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్‌వర్మ దర్శకుడు. మొద‌టి పార్టుతో ఈ సినిమా పూర్తి కాలేదు స‌రిక‌దా.. అస‌లు క‌థ అంతా రెండో పార్టులోనే ఉండ‌నుంది. ఎందుకంటే ఈ సారి యుద్ధం చేయ‌బోయేది హ‌నుమాన్ అంశ కాదు ఏకంగా హ‌నుమానే అని లీడ్ ఇచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ..దానితో రెండో పార్ట్ మీద అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి.

ఇప్పుడు మొద‌టి పార్ట్ ‘హను–మాన్‌’ సినిమా సూపర్‌హిట్‌ కొట్టడంతో వెంటనే తన నెక్ట్స్‌మూవీగా ‘జై హనుమాన్‌’ సినిమాను ప్రారంభించారు ప్రశాంత్‌ వర్మ. ‘హను–మాన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. రామమందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ట జరుపుకున్న సమయంలో ‘జై హను–మాన్‌’ సినిమాను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రశాంత్‌ వర్మ.

అయితే ‘జై హనుమాన్‌’ సినిమా పెద్ద స్కేల్‌లో రూపొందనుంది. దీంతో ‘జై హనుమాన్‌’ సినిమాలో రాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు. హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారు? అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. ప్ర‌స్తుతానికి హ‌నుమాన్ పాత్ర చేయ‌బోయేది రానా అని నెట్టింట్లో విన‌బ‌డుతోంది మ‌రి చూడాలి అందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో..

Read More: విజయ్ దేవ‌ర‌కొండ సినిమా నుండి శ్రీ‌ల‌ల త‌ప్పుకుందా?

ట్రెండింగ్ వార్తలు