రాజమౌళితో మహేష్ బాబు.. ఆకట్టుకుంటున్న మహేష్ బాబు న్యూ లుక్!

April 19, 2024

రాజమౌళితో మహేష్ బాబు.. ఆకట్టుకుంటున్న మహేష్ బాబు న్యూ లుక్!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి ఇటీవల ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఈ సినిమాకు ఏకంగా గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులు కూడా రావడంతో ఈయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది.

ఇలా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాకు ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా రాజమౌళి మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నటువంటి మహేష్ బాబు ఎక్కడ కూడా తన లుక్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

మొదటిసారి దుబాయ్ నుంచి రాజమౌళితో పాటు మహేష్ బాబు అలాగే నిర్మాత కే ఎల్ నారాయణ తిరిగి వస్తూ ఎయిర్ పోర్టులో కనిపించడంతో మహేష్ బాబుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో సంచలనగా మారింది. పొడవాటి జుట్టుతో మహేష్ బాబు విభిన్న లుక్ లో కనిపిస్తున్నారని తెలుస్తుంది బహుశా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఇలాగే కనిపించబోతున్నారని తెలుస్తుంది.

Read More: ఆ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ రియల్ కాదా… అంతా సీజీ ప్రభావమేనా?

ట్రెండింగ్ వార్తలు