August 24, 2022
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న థియే టర్స్‌లో రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా హిట్ సాధించాలంటే కనీసం వందకోట్లు రాబట్టాలి. రెండు తెలుగురాష్ట్రాల్లో ‘లైగర్’ సినిమా 55 కోట్లకు, మిగతా ఏరియాలు, ఓవర్‌సీస్ కలుపుకుని 45 కోట్లకు ‘లైగర్’ సినిమాను అమ్మారు. దీంతో లైగర్ సినిమా బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే కనీసం వందకోట్ల గ్రాస్‌ను దాటాలి.
ఇక లైగర్ కథ విషయానికి వస్తే…కరీంగనర్ నుంచి వచ్చిన ఓ కుర్రాడు ముంబై బస్తీల్లో జీవనం సాగిస్తుంటాడు. ఆ కుర్రాడి తల్లి అతను జాతీయ చాంపియన్ కావాలని కోరుకుంటుంది. కానీ ఆ కుర్రాడు తన ప్రతిభతో అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ అవుతాడు. ఈ క్రమంలోనే ఓ ధనవంతురాలు అయిన అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ కుర్రాడు. అయితే మధ్యలో మైక్‌టైసన్ ఎందుకు వచ్చాడు? అతని పాత్ర ఏంటి? ఆ రిచ్‌గాళ్ ఆ పేదకుర్రాడిని ప్రేమించిందా? లేదా? అన్నదే కథ. ఇందులో కుర్రాడిగా విజయ్‌దేవరకొండ, అతని తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తారు. ఇక విజయ్ దేవరకొండ లవర్‌గా అనన్యపాండే నటించారు.