April 4, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నారు. ఈ సినిమా హిట్ అవటంతో మంచి దూకుడు మీద ఉన్న రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది లియో సినిమాతో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ 171 సినిమాని ఏ విధంగా తరికెక్కిస్తాడో వేచి చూడాల్సిందే. అయితే మొన్న విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ వాచీలతో పోస్టర్ తోనే వావ్ అనిపించాడు లోకేష్.
దాంతో సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగిపోవటమే కాకుండా ఈసారి రజనీతో ఇండస్ట్రీ హిట్ కొట్టేలాగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం రజనీ చేస్తున్న తలైవా 170 పూర్తి కాగానే ఈ 171 మూవీ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కథ మొత్తం గోల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందంట. సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా కనిపించబోతున్నట్లు సినీవర్గాల సమాచారం.
సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఇప్పటివరకు ఈ సినిమాకి టైటిల్ పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి కళుగు అనే పేరుని మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు చెన్నై సినీ వర్గాల టాక్. ఈ సినిమా టైటిల్ ని ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మూవీ మేకర్స్.
అయితే మూవీ టైటిల్ కళగు అనే పెడతారా? లేదంటే టైటిల్ చేంజ్ చేస్తారా అనేది ఆ రోజు కన్ఫర్మ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర మునిపెన్నడూ లేని విధంగా ఉంటుంది. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనిపించే అవకాశం ఉంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఇందులో నా గత చిత్రాల్లో చూపించిన విధంగా మాదకద్రవ్యాలను చూపించను అని చెప్పడం తో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడటం గమనార్హం.
Read More: మోటివేషనల్ స్పీకర్ కూడా అయిన ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రెగ్నెంట్.. ఆమె ఎవరంటే!