రజినీకాంత్ మూవీలో శృతిహాసన్ – అలాంటి పాత్రలో ఫస్ట్ టైమ్

April 16, 2024

రజినీకాంత్ మూవీలో శృతిహాసన్ – అలాంటి పాత్రలో ఫస్ట్ టైమ్

‘తలైవార్171’ అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో శృతిహాసన్ సూపర్ స్టార్ కూతురిగా కనిపించనుందట.

సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రజనీకాంత్‌ను వరుస ప్లాపుల నుంచి ఉపశమనం కలిగించింది. అంతేకాదు గత ఏడాది కోలీవుడ్లో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ‘వేట్టాయాన్’ సినిమాతోపాటు లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

కోలీవుడ్ స్టార్ హీరోలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన లోకేష్ రజనీకాంత్‌తో సినిమాని అనౌన్స్ చేయగానే ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే రజినీకాంత్ తో తాను చేయబోయే సినిమాకి తన గత సినిమాలతో ఎలాంటి సంబంధం లేదని, ఈసారి ఓసారి కొత్త కథతో సినిమా చేస్తున్నట్లు లోకేష్ స్వయంగా వెల్లడించాడు. కాగా ఈ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపిస్తారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురుగా కమలహాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటించిబోతున్నట్లు సమాచారం. కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించి దాదాపు 25 ఏళ్లు కావస్తోంది. ఇలాంటి తరుణంలో కమల్ కూతురు శృతిహాసన్ రజనీకాంత్ కూతురిగా నటిస్తుండడం కోలీవుడ్ లో సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ నెల 22న టైటిల్ అనౌన్స్ మెంట్, రజనీకాంత్ తో తాను చేయబోతున్న సినిమా టైటిల్ ని అలాగే టీజర్‌ను ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల స్వయంగా తెలియజేశారు. కాగా ఈ చిత్రానికి ‘కళుగు’ అని టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి. ఈ ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

శృతిహాసన్ కోలీవుడ్లో కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే గత ఏడాది టాలీవుడ్ లో మాత్రం హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. 2023లో శృతిహాసన్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న శృతిహాసన్ సుమారు మూడేళ్ల తర్వాత కోలీవుడ్లో నటించబోతోంది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగా కనిపించనుండటం విశేషం. రజినీ మూవీలో కమల్ కూతురు నటించడం ఇదే ఫస్ట్ టైమ్.

Read More: విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్‌లో అడుగు పెట్టిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

ట్రెండింగ్ వార్తలు