సంక్రాంతికి వచ్చి చరిత్ర తిరగరాసిన హనుమాన్ చిత్రం!

January 31, 2024

సంక్రాంతికి వచ్చి చరిత్ర తిరగరాసిన హనుమాన్ చిత్రం!

సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎప్పుడు కూడా స్టార్ హీరోల సినిమాలే విడుదలవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీపడుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా అచ్చం అలాగే స్టార్ హీరోలో సినిమాలన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇలా స్టార్ హీరోల సినిమాల నడుమ ఒక యంగ్ హీరో కూడా తన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో ఆదరణ రావడం విశేషం. హనుమాన్ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా విడుదలైంది కానీ గుంటూరు కారం సినిమాను మించి హనుమాన్ సంచలనాలను సృష్టించింది.

ఈ సినిమా విడుదలైనటువంటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా సంక్రాంతి సినిమాలలో సరికొత్త చరిత్రను తిరగరాసింది. గత ఐదు సంవత్సరాలుగా సంక్రాంతి అంటేనే స్టార్ హీరోల సినిమాలు అనేలా పెద్ద ఎత్తున సినిమాలు పోటీపడేవి.

కానీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో స్టార్ హీరోల సినిమాలతో పాటు హనుమన్ సినిమా కూడా పోటీకి దిగి స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి మరి ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. మూడేళ్ల కిందట ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నెలకొల్పిన రికార్డు బద్దలైపోయింది. ఫుల్ రన్ అయ్యేసరికి ఏరియాల వారీగా కూడా హనుమాన్ అన్ని రికార్డులనూ తుడిచిపెట్టేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

భారీ చిత్రాలకు పేరు సంపాదించుకున్నటువంటి సంక్రాంతి సీజన్లో హనుమాన్ లాంటి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి చరిత్రలను తిరగరాసే విజయాన్ని అందుకుందని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా ఎంతో సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతూ ఈ చిత్రం ఇంకో వంద కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఈ రికార్డులు బద్దలు కావడం కష్టంగానే ఉందని చెప్పాలి.

Read More: పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క సీక్రెట్ మ్యారేజ్.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్?

ట్రెండింగ్ వార్తలు