మహేష్-రాజమౌళి సినిమా టైటిల్ ఫిక్స్ చేసేసారా?

February 17, 2024

మహేష్-రాజమౌళి సినిమా టైటిల్ ఫిక్స్ చేసేసారా?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు రాజమౌళి మీదే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో మొదటి నుంచి రాజమౌళి ఏ సినిమా తీసిన తర్వాత ఏమి తీయబోతున్నారు? ఎప్పుడు తీయబోతున్నారు? అని తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసేవారు. బాహుబలి సినిమా విడుదలై సృష్టించిన బీభత్సం తర్వాత రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అని ఇండియా వైడ్ గా అందరూ చర్చలు జరిపారు. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

సినిమా ఎలా ఉండబోతుంది? ఎప్పుడు రాబోతుంది? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు అన్న విషయం తప్ప మనకి ఇంక ఏ అధికారక ప్రకటనలు ఇవ్వలేదు. అంత ఆసక్తిగా వెయిట్ చేసిన తర్వాత ఈ సినిమాలో హీరో మహేష్ బాబు అని తెలిసినప్పుడు ఫాన్స్ లో ఆత్రుత రెట్టింపు అయింది. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాలని తెలుగు ప్రేక్షకులు ఎన్నో సంవత్సరాలనుంచి కలలు కంటూనే ఉన్నారు.

ఆఖరికి ఆ కలలు నిజమయ్యే టైం రానే వచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి చర్చలు, ఊహాగనాలు అప్పుడే మొదలైపోయాయి. ఈ సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ వైరల్ అవుతుంది. మొన్న మొన్ననే ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్ కీలకపాత్రలో, అలాగే ఇండోనేషియా యాక్ట్రెస్ చెల్సియా ఎలిజిబిట్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది అని వార్తలు వచ్చాయి.

అలాగే ఈ మధ్య ఈ సినిమా పేరు ఫిక్స్ చేశారు అని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకి ‘ మహారాజ్ ‘ అనే టైటిల్ ని అనుకుంటున్నారట. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా కధ,దీనికి ఇంత సింపుల్ టైటిల్ ఏంటి అని కొంతమంది ప్రేక్షకులు అనుకోగా, మరికొందమంది ఈ సినిమా టైటిల్ చూసి సంతృప్తి చెందుతున్నారు. అయినప్పటికీ ఇది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి కేవలం పుకారు అని అనుకోవాలి. సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే దానికి చాలా సమయమే పట్టేటట్టుగా కనిపిస్తుంది.

Read More: నాగబాబు వ్యక్తిత్వం పై ప్రియాంక సింగ్ షాకింగ్ కామెంట్స్.. అలాంటి వ్యక్తి అంటూ?

ట్రెండింగ్ వార్తలు