December 14, 2021
ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత ఆడియన్స్ థియేటర్స్ వచ్చింది కేవలం క్రాక్ వంటి మాస్ మూవీతోనే కాదు..అది సంక్రాంతి సీజన్ కాబట్టి కూడా. అందుకే ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని ఆయా నిర్మాతలు తెగ ఉత్సాహపడుతుంటారు. ‘సరిలేరు నీకెవ్వరు’ (2020 సంక్రాంతికి రిలీజైంది) ఇచ్చిన ఉత్సా హమో లేక చిత్రం నిర్మాత అనిల్ సుంకర చూపించిన కలెక్షన్స్ మహాత్యమో ఎమో కానీ మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ చిత్రాన్ని కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నాడు మహేశ్‌బాబు. అలా అనుకున్నాడో లేదో ఇలా సంక్రాంతి రిలీజ్ అని ‘సర్కారు వారి పాట’ పోస్టర్‌ను దింపేశాడు మహేశ్‌బాబు.
Read More: దిక్కుతోచని లైగర్…ఈ ప్రకారం సక్రాంతి బరిలో నిలిచిన తొలి చిత్రం ‘సర్కారువారి పాట’యే. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, నాగార్జున ‘బంగార్రాజు’(పరోక్షంగా చెప్పించారు), రాజశేఖర్ ‘శేఖర్’ (పరోక్షంగానే..) సంక్రాంతి బరిలో నిలిచాయి. కానీ మూడుసార్లు వాయిదా పడ్డ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సంక్రాంతికి వస్తున్నాం అనగానే అప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ ఒక్కసారిగా ఆలోచనల్లో పడ్డా యి. కానీ ఆర్‌ఆర్‌ఆర్ మల్టీస్టారర్ (ఎన్టీఆర్, రామ్‌చరణ్) కావడం, పైగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో..ఒక్క ఆర్‌ఆర్‌ఆర్ తప్ప మిగతా సినిమాలన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటాయనే టాక్ వినిపించింది. ఇందుకు తగ్గట్టుగనే రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య సంక్రాంతి సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపారు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ ‘రాధేశ్యామ్’. పవన్‌కల్యాణ్– రానా భీమ్లానాయక్‌లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే ముందుగానే కాస్త కంగారు పడ్డ మహేశ్‌బాబు మాత్రం ‘సర్కారువారి పాట’ సినిమాను ఏప్రిల్ 1కి వాయిదా వేశాడు.
Read More: తప్పిపోయిన రౌడీబాయ్స్…ఆ తర్వాత తన సినిమాల మాదిరిగానే మిగతా సినిమాలు(సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు) కూడా ఆర్‌ఆర్‌ఆర్ దెబ్బుకు తప్పుకుంటాయనుకున్నాడు కానీ అదేం జరగలేదు. ఒక్క ‘సర్కారువారిపాట’ సినిమాయే సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. రాజమౌళి తర్వాతి సినిమాలో మహేశ్‌బాబే హీరో. ఈ కారణంగానే రాజమౌళి రిక్వెస్ట్ మేరకు మహేశ్ ‘సర్కారువారిపాట’ నుంచి సంక్రాంతి నుంచి ఉగాదికి వాయిదా వేసి ఉంటాడు. కానీ ఆర్‌ఆర్‌ఆర్ థాటికి సంక్రాంతి రేస్ సినిమాలు ఏవీ ఉండవనుకున్న మహేశ్‌బాబు అంచనా మాత్రం తప్పింది. ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన తొలి సినిమా‘సర్కారు వారి పాట’యే సంక్రాంతి బాక్సాఫీసు గురినుంచి తప్పుకున్న తొలి సినిమా అయ్యింది. ఇలా మొత్తానికి తనకు తెలిసే మహేశ్‌బాబు సంక్రాంతి పండగను వద్దనుకున్నాడా? లేక రాజమౌళి సినిమా ఆబ్లిగేషన్ కారణంగా ‘సర్కారువారిపాట’ చిత్రాన్ని ఉగాదికి వాయిదా వేశాడా? అన్నది మహేశ్ అండ్ రాజమౌళికే తెలియాలి. ఇక ప్రస్తుతం తన కాలికి జరిగిన సర్జరీ చికిత్సలో భాగంగా మహేశ్‌బాబు ఫారిన్‌లో ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత ‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.