రాజ‌మౌళిపై ఫైర్ అవుతున్న మ‌హేశ్‌-ప‌వ‌న్ అభిమానులు

January 2, 2022

రాజ‌మౌళిపై ఫైర్ అవుతున్న మ‌హేశ్‌-ప‌వ‌న్ అభిమానులు

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన‌ ఆర్ఆర్ఆర్( రౌద్రం రణం రుధిరం) వాయిదా ప‌డ‌డంపై అటు మ‌హేష్‌బాబు అభిమానులు, ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున రాజ‌మౌళిపై ఫైర‌వుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రేయ స‌ర‌న్ వంటి న‌టులు​ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ముందుగా ప్ర‌క‌టించారు.

నిజానికి ఈ 2022 సంక్రాంతికి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మొద‌టి సినిమా స‌ర్కారు వారి పాట‌. మ‌హేష్‌కి సంక్రాంతికి మంచి ట్రాక్ రికార్డ్ ఉండ‌డంతో ఫ‌స్ట్ ఎస్‌వీపిని అనౌన్స్ చేశారు. దాంతో మ‌హేష్ ఫ్యాన్స్ మ‌రోసారి సంక్రాంతి రికార్డుల కోసం సంతోషంగా ఎదురుచూడ‌సాగారు. కాని మ‌హేశ్‌ని ఎలాగోలా క‌న్వీన్స్ చేసి ఎస్‌వీపిని స‌మ్మ‌ర్‌కి వాయిదా వేయించాడు రాజ‌మౌళి. దాంతో మ‌హేష్ ఫ్యాన్స్ రాజ‌మౌళిపై కోపంగా ఉన్నారు. ఆ త‌ర్వాత సంక్రాంతి బరిలో రావాల్సిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25కి వాయిదా వేయడానికి కారణం కూడా ఆర్ ఆర్ ఆర్ మేకర్సే..సంక్రాంతికి భారీ వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ రెండు పెద్ద సినిమాల‌ని వాయిదా వేయించారు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కూడా వాయిదా ప‌డ‌డంతో రాజ‌మౌళిని ప‌వ‌న్ ఫ్యాన్స్, మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేధిక‌గా తిడుతున్నారు. కేవ‌లం రాజ‌మౌళి స్వార్ధం కార‌ణంగా సంక్రాంతి బరిలో పెద్ద‌ సినిమాలు ఏవీ లేక చప్పగా మారింది అంటూ ఫైర్ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు