September 13, 2022
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు SS రాజమౌళి..వీరి కాంబినేషన్ లో మూవీ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో వేచిచూస్తున్నారు. ఈ క్రమంలోనే జక్కన్నఎట్టకేలకు మహేశ్ బాబుతో సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా స్టోరీ లైన్‌ని కూడా లీక్ చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కు డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడి మీడియా నుంచి హీరో మహేశ్, మీ కాంబో లో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? అనే ప్రశ్న ఎదురైంది. ఇక ఈ ప్రశ్నకు జక్కన్న బదులిస్తూ..”ప్రిన్స్ తో నేను తియ్యబోయే చిత్రం ఫుల్ యాక్షన్ అడ్వెంచర్.. గ్లోబ్ ట్రాటింగ్ (ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం చేయడం)ఈ మూవీలో మహేశ్ జేమ్స్ బాండ్ కు ఏమాత్రం తీసిపోడని” తెలిపారు.
అభిమానులు సైతం ప్రిన్స్ ను జేమ్స్ బాండ్ పాత్రలోనే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారన్నాడు. ఈ విషయాన్ని గతంలో పలు మార్లు జక్కన్న చెప్పకనే చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. గతంలో కథారచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. ఇప్పుడు జక్కన్న ఏకంగా స్టోరీ లైన్ చెప్పి ప్రేక్షకులను సర్ప్రైజ్ కు గురిచేశాడు.
ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB28 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ ను కూడా మెుదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ నిన్న వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన వెంటనే జక్కన్న షూటింగ్ స్టార్ట్ అవనుంది.