పండగలను బ్లాక్‌ చేస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి

July 5, 2022

పండగలను బ్లాక్‌ చేస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి

టాలీవుడ్‌లో పండగ సీజన్‌ అంటే భలే క్రేజ్‌ ఉంటుంది. పండగ సమయాల్లో సినిమాలు చూసేందుకు ఆడి యన్స్‌ కూడా బాగా ఉత్సాహం చూపిస్తారు. దీంతో నిర్మాతలు సినిమాలను వీలైతే పండగ సీజన్‌లో రిలీజ్‌ చేయాలనే ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ విషయంలో ఈ సారి చిరంజీవి మంచి జోరు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది.

మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘లూసీఫర్‌’ తెలుగులో రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవి హీరోగా నటించారు. తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం ఈ దసరా పండక్కి రిలీజ్‌ కానుంది. ఇలా దసరా సీజన్‌ను బుక్‌ చేశారు చిరంజీవి.

సేమ్‌ సంక్రాంతి సీజన్‌కు బుక్‌ చేశారు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. రవితేజ, బాబీ సింహా కీలక పాత్రధారులు. ఇలా దసరా, సంక్రాంతి సీజన్స్‌ను బుక్‌ చేశారు చిరంజీవి. ఆయన చివరి చిత్రం ఆచార్య బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. దీంతో పండగ సమయాల్లో రిలీజ్‌ అయితే కలెక్షన్స్‌ పరంగా కూడా తన సినిమాలకు మైలేజ్‌ ఉంటుందని భావిస్తున్నట్లుగా ఉన్నారు చిరంజీవి

ట్రెండింగ్ వార్తలు