నా మాటలకు బాధపడి ఉంటే క్షమించండి.. వెనక్కు తగ్గిన నాగబాబు!

March 1, 2024

నా మాటలకు బాధపడి ఉంటే క్షమించండి.. వెనక్కు తగ్గిన నాగబాబు!

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసినటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి . తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నాగబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన హీరోల ఎత్తు గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇక ఈయన హీరోల ఎత్తు గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయడంతో ఒక హీరో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ట్రోల్ చేశారు. ఇలా తన గురించి ట్రోల్స్ వస్తున్నటువంటి తరుణంలో నాగబాబు స్పందించి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు. మరి నాగబాబు రాసినటువంటి ఈ లేఖలో ఏముంది అనే విషయానికి వస్తే…

నా కుమారుడు వరుణ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నేను మాట్లాడుతూ పోలీస్ క్యారెక్టర్లకు ఆరడుగుల పైన ఉండేవాళ్లు చేస్తేనే బాగుంటుందని అలా కాకుండా ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండే హీరోలు పోలీస్ క్యారెక్టర్లు చేస్తే పెద్దగా సూట్ అవ్వదు అంటూ మాట్లాడినటువంటి మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి.

నేను ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా మాట్లాడినది కాదు అనుకోకుండా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల ద్వారా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి ఇట్లు మీ నాగబాబు అంటూ ఈ సందర్భంగా నాగబాబు బహిరంగ క్షమాపణ లేఖ విడుదల చేశారు. ఇలా నాగబాబు క్షమాపణలు చెప్పడంతో పలువురు ఈ క్షమాపణల పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అడుసు తొక్క నేల కాలు కడగనేల అనే సామెతను ఉపయోగిస్తూ..దురుసుగా మాట్లాడటం ఎందుకు మరి క్షమాపణలు చెప్పడం దేనికి మాట్లాడే ముందు కాస్త చూసుకోవాల్సిన పనిలేదా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Read More: నా జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితే వాళ్లే అండగా ఉన్నారు.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు