నాగచైతన్యను నేను పెంచలేదు.. చైతన్య పై అమల షాకింగ్ కామెంట్స్!

February 16, 2024

నాగచైతన్యను నేను పెంచలేదు.. చైతన్య పై అమల షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం నుంచి నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం అఖిల్ నాగచైతన్య ఇద్దరు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఈ ఇద్దరు హీరోలకి అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పాలి. ఇక నాగార్జున మొదటి భార్య లక్ష్మి కుమారుడు చైతన్య నాగచైతన్య పుట్టిన తర్వాత లక్ష్మి విడాకులు తీసుకున్న విడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా లక్ష్మీ విడిపోవడంతో నాగచైతన్య తదుపరి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించారు. ఇక నాగచైతన్య ఈ ఫ్యామిలీతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా అకేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒకే ప్రేమ్ లో కనిపిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా అఖిల్ నాగచైతన్య గురించి అమల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిన్నప్పటినుంచి నాగచైతన్యను నేను పెంచలేదని అమల కామెంట్స్ చేశారు. తాను చిన్నప్పటి నుంచి తన తల్లి లక్ష్మీ వద్ద చెన్నైలోనే పెరిగారని తెలిపారు. అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చే వారని ఇక్కడికి వచ్చినా నాతో కంటే తన నాన్నతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారు అంటూ అమల తెలిపారు . అఖిల్ కి నాగచైతన్య ఒక మంచి అన్నయ్య. చిన్నప్పుడు చైతన్య వెంటే అఖిల్ తిరిగేవాడు తాను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు.

ఇక చైతన్య నాటి కాదు అఖిల్ మాత్రం హైపర్ ఆక్టివ్ అంటూ అమల ఈ సందర్భంగా తన ఇద్దరు కొడుకులు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి సినిమాలు కనుక విడుదలవుతున్నాయి అంటే నా గుండెల్లో రైళ్లు పరిగెడతాయని కానీ సినిమా ఫలితం ఎలా ఉన్నా రెండు రోజులలోనే ఆ సినిమా రిజల్ట్ మర్చిపోయి తన తండ్రిలాగే వీరిద్దరూ కూడా తదుపరి సినిమాపై ఫోకస్ పెడతారని అమల తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Read More: ఓజీతో సుజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!

ట్రెండింగ్ వార్తలు