బర్త్ డే స్పెషల్.. తండేల్ నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్!

May 9, 2024

బర్త్ డే స్పెషల్.. తండేల్ నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్!

సహజ నటి సాయి పల్లవి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు కావడంతో ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

తెలుగులో ఈమె నాగచైతన్య సరసన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్డేట్స్ విడుదల చేశారు. ఇక సాయి పల్లవి పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి బుధవారం ఆమె లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. అలాగే గురువారం ఈ సినిమా నుంచి సాయి పల్లవికి సంబంధించిన ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక బుధవారం విడుదల చేసినటువంటి పోస్టర్ లో భాగంగా సాయి పల్లవి సాగర తీరాన కూర్చుని నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నటువంటి పోస్టర్ విడుదల చేశారు. ఇలా ఈమె నాచురల్ లుక్ లో కనిపించడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంటుంది. ఇక త్వరలోనే ఈమెకు సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక సాయి పల్లవి ఈ సినిమాలతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో శివ కార్తికేయన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ కుమారుడి సరసన ఒక సినిమాలో చేస్తున్నారు. అలాగే రామాయణం సినిమాలో కూడా ఈమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Read More: బాలయ్య బాబు మూవీ విషయంలో ఆ డైరెక్టర్ హర్ట్ అయ్యారా.. నమ్మి మోసపోవడం నా తప్పే అంటూ!

ట్రెండింగ్ వార్తలు