తండేల్ సారం ఇదే.. నెవ్వర్ బిఫోర్ అనేలా నాగ చైతన్య

January 6, 2024

తండేల్ సారం ఇదే.. నెవ్వర్ బిఫోర్ అనేలా నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య త్వరలోనే తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు ఇక నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోలో నాగ చైతన్య మాస్ లుక్ లో కనిపించారు. ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ ఈ గింప్ల్స్ విడుదల చేశారు. గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లిన నాగ చైతన్య‌ సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్థాన్ జైలు నుంచి అత‌డు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీతో ఈ సినిమా రాబోతుందని ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఈ వీడియోలో నాగచైతన్య చెప్పినటువంటి డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి ఈ పాలియేట గురి తప్పేదేలే అంటూ ఈయన డైలాగ్స్ చెబుతారు.

పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు జాతీయ జెండాను అక్కడికి ఇస్తారు మా దేశం నుంచి విడిపోయిన ముక్క పాకిస్తాన్ అంటూ భారతదేశం గురించి ఎంతో గొప్పగా చెబుతారు. చివరిలో సాయి పల్లవిని చూపించారు. సముద్రపు తీరం దగ్గర ఈమె నాగచైతన్య కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లు ఇందులో చూపించారు. ఇక ఈ వీడియో చివరిలో నాగచైతన్య డైలాగ్ చెబుతూ బుజ్జి తల్లి వస్తున్నాను కదే కాస్త నవ్వు అన్నప్పుడు సాయి పల్లవి ఫేస్ రివిల్ చేయడంతో ఈ గ్లింప్ వీడియో పూర్తి అవుతుంది. మొత్తానికి ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమాతో నాగచైతన్య మాస్ హిట్ అందుకోబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.

Read More: ఈ బాధను మాటల్లో వర్ణించలేను.. నా గుండెకు ఇది మానని గాయం : పాయల్

ట్రెండింగ్ వార్తలు