కల్కి 2898ఏడీ రిలీజ‌య్యేది అప్పుడేనా?

July 23, 2023

కల్కి 2898ఏడీ రిలీజ‌య్యేది అప్పుడేనా?

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కల్కి2898 ఏడీ’. కమల్‌హాసన్‌, అమితాబ్‌బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీమూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత 2023 అంటే ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఇటీవల ఈ సినిమాను జనవరి 12, 2024లో విడుదల చేస్తామని ప్రకటించారు. అంటే సంక్రాంతి సీజన్‌.  ‘కల్కి2898ఏడీ’ సినిమా వాయిదా పడుతుందని అందరూ ఊహిస్తున్నారు.

 ‘కల్కి2898ఏడీ’ సినిమా గ్లింప్స్‌ వీడియోలో రిలీజ్‌ డేట్‌ లేదు. దీనికి తోడు ‘కల్కి2898 ఏడీ’ గ్లిం‍ప్స్‌ వీడియో బాగుందని చాలామంది సినీ ప్రముఖులు ట్వీట్స్‌ చేశారు. అయితే రిలీజ్‌డేట్‌పై స్పష్టత లేదన్నట్లుగా రాజమౌళి ట్వీట్‌లో ఉంది.  ‘కల్కి 2898ఏడీ’ టీజర్‌ బాగుందని, అయితే రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్నట్లుగా ట్వీట్‌లో రాజమౌళి ప్రశ్నించారు. రాజమౌళి అప్రిషియేషన్‌కు నాగ్‌ అశ్విన్‌ థ్యాంక్స్‌ చెప్పారు కానీ రిలీజ్‌ డేట్‌ను మెన్షన్‌ చేయలేదు. దీంతో ‘‘కల్కి 2898ఏడీ’  సినిమా వాయిదా ఖాయమంటూ చెప్పుకుంటున్నారు కొందరు నెటిజన్లు.

ప్రభాస్‌ ‘కల్కి2898ఏడీ’ సినిమా సంక్రాంతికీ ఎలాగూ రాదని, సంక్రాంతికి రిలీజ్‌ అయ్యేందుకు టాలీవుడ్‌లో ఆల్రెడీ రవితేజ ‘ఈగిల్‌’, విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), తేజా సజ్జా ‘హనుమాన్‌’ చిత్రాలు రెడీ అయ్యాయి. ఎలాగూ మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సంక్రాంతికే రిలీజ్‌ అవుతుంది.  ఒకవేళ అన్ని కార్యక్రమాలు అనుకున్నట్లుగా పూర్త‌యి ‘కల్కి 2898ఏడీ’  సినిమా 2024, జనవరి 12కే విడుదల అయితే సంక్రాంతి బాక్సాఫీస్‌ రేసు మారుతుంది.

వైజయంతీమూవీస్‌లో చిరంజీవి హీరోగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఈ రెండు చిత్రాలూ కూడా మే9నే విడుదల అయ్యాయి. ఈ ప్రకారం చూసుకుంటే 2024 మే 9న ‘కల్కి 2898ఏడీ’  చిత్రం విడుదల అయ్యే చాన్సెస్‌ కనిపిస్తున్నాయి. పైగా 2024 మే9 గురువారం. ఆల్మోస్ట్‌ వీకెండ్‌. ఇది కూడా కలిసొచ్చింది. మరి..‘కల్కి 2898ఏడీ’ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయకతప్పదు.

ఇంకా చదవండి : ఆ హీరోపై పరోక్షంగా సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్

ట్రెండింగ్ వార్తలు