నాని తెలిసే చేశాడా.. పవన్‌తో పోటీనా?

August 28, 2022

నాని తెలిసే చేశాడా.. పవన్‌తో పోటీనా?

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఒదేల సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ..రిలీజ్‌ డేట్‌ విషయంలోనే నాని ఎందుకు ఇలా ఆలోచించాడా? అని ఇటు నాని, అటు పవన్‌ఫ్యాన్స్‌ ఆలోచిస్తున్నారు. ‘దసరా’ సినిమాను మార్చి 30న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు నాని. కానీ ఇదే రోజున పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమాను రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా ఈ చిత్రం నిర్మాత ఏఎమ్‌రత్నం ఇటీవల వెల్లడించారు. ఇదీ తెలిసి కూడా నాని మార్చి 30ని రిలీజ్‌కు బుక్‌ చేసుకోవడం పవన్‌ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తుంది. బహుశా..పవన్‌ పొలికల్‌గా బిజీ అయితే హరిహరవీరమల్లు షూటింగ్‌ సమయానికి పూర్తి కాకపోవచ్చు. దీంతో శ్రీరామనవమి ఫెస్టివ్‌ల్‌ వీకెండ్‌ సీజన్‌ రిలీజ్‌ డేట్‌ను వదులు కోవడం ఎందుకు? అని మార్చి 30ని ముందుగా బుక్‌ చేసి ఉంటారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

మరోవైపు నాని కెరీర్‌లో ఫస్ట్‌ ప్యాన్‌ఇండియన్‌ ఫిల్మ్‌ ఇది. హిందీలో కూడా రిలీజ్‌ అవుతుంది. అయితే ఇదే రోజున అంటే మార్చి 30న అజయ్‌దేవగన్‌ ‘భోళ’ కూడా విడుదల కానుంది. సో..హిందీలో నానికి థియేటర్స్‌ దక్కడం అనేది కొంచెం కష్టమే. పైగా ‘భోళ’ తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘ఖైది’కి హిందీ రీమేక్‌. మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌. ‘భోళ’ హిందీ ఆడియన్స్‌కు నచ్చితే మాత్రం నానికి కలెక్షన్స్‌ పరంగా ‘దసరా’ పండగ ఉండదనే చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు