భర్తను అన్ ఫాలో చేసిన నయనతార… విడాకుల వైపు అడుగులు వేస్తున్నారా?

March 2, 2024

భర్తను అన్ ఫాలో చేసిన నయనతార… విడాకుల వైపు అడుగులు వేస్తున్నారా?

సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని విడిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా విడాకులు తీసుకొని విడిపోయారు తాజాగా మరొక జంట కూడా అదే దారిలోనే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ గత మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితం తర్వాత ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే సరోగసి ద్వారా ఇద్దరి కవల పిల్లలకు జన్మనిచ్చారు.

ఇలా వీరిద్దరూ తమ పిల్లలతో కలిసి ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంతో క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇలా ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని నయనతార తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పకనే చెప్పేశారు. ఈమె సోషల్ మీడియాలో తన భర్త విగ్నేష్ ను అన్ ఫాలో చేయడమే అందుకు కారణం అని తెలుస్తుంది.

ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు ఎవరైనా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు సోషల్ మీడియాలో ముందుగా అన్ ఫాలో చేస్తూ ఉంటారు కూడా తన భర్తను అన్ ఫాలో చేయడంతో కొంపతీసి నయనతార కూడా విడాకులు తీసుకొని విడిపోబోతుందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు నయనతార తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను మాత్రం డిలీట్ చేయలేదు కానీ తన భర్తను మాత్రం అన్ ఫాలో చేశారు. మరి ఏదైనా సమస్య కారణంగా ఇలా జరిగిందా లేకపోతే నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Read More: తమన్నా చరణ్ ను అంతలా అవమానించిందా… అంత దూరం పెట్టేసిందా?

ట్రెండింగ్ వార్తలు