విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన నయనతార..అలా క్లారిటీ ఇచ్చారుగా?

March 4, 2024

విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన నయనతార..అలా క్లారిటీ ఇచ్చారుగా?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు విడాకులు తీసుకొని విడిపోవడం సర్వసాధారణంగా జరిగే అంశం అయితే ఇప్పటికే ఎంతోమంది స్టార్ట్ సెలబ్రిటీలో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ కూడా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈమె గతంలో పెద్ద ఎత్తున ప్రేమలు బ్రేకప్ అంటూ వార్తలలో నిలిచారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. ఈ విధంగా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహం తర్వాత కొద్ది నెలలకే వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా తన పిల్లలతో నయనతార దంపతులు ఎంతో సంతోషంగా ఉండడం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈమె బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

ఈ విధంగా వీరిద్దరూ ఎంతో అన్యోన్య దంపతులుగా ఉండగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో నిన్న ఓ వార్త వైరల్ గా మారింది. నయనతార తన భర్తను అన్ ఫాలో చేయడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రాగా అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలపై నయనతార భర్త విగ్నేష్ స్పందించి క్లారిటీ ఇస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టాడు.

నయనతార తన భర్తను అన్ ఫాలో చేసిందని ఇద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో విగ్నేష్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా నయనతారతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఈ విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. కేవలం సాంకేతిక లోపం కారణంగానే ఇలా విగ్నేష్ పేరు కనిపించలేదని అందుకే తనని ఫాలో అవుతున్నట్టు కనిపించకపోయేసరికి విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి.

Read More: పవన్ కళ్యాణ్ తో నా కోరిక తీరలేదు.. పూనమ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు