#NBK107: కాపీనా? రీమేకా?

February 22, 2022

#NBK107: కాపీనా? రీమేకా?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తున్న #NBK107 సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ లుక్‌ అచ్చు నార్తన్‌ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘మఫ్తీ’లోని ఒక హీరో శివరాజ్‌కుమార్‌లుక్‌ను పోలీఉంది. దీంతో బాలకృష్ణలుక్‌ అచ్చు అలానే ఉందని, అయితే #NBK107 మఫ్తీకి తెలుగు రీమేకా? అని అను మానాలను లేవనెత్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ సినిమాలోని బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ ఇంత తొందరగా విడు దల చేయాలని మేకర్స్‌ భావించలేదు. కానీ షూటింగ్‌ లొకేషన్‌ స్పాట్‌ నుంచి బాలకృష్ణలుక్‌ రివీలై నెట్టిం ట్లో వైరల్‌ కావడంతో ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేయకతప్పలేదు.

#NBK107

ఇక గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తెలంగాణ లోని సిరిసిల్లలో జరుగుతోంది. యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌.

Readmore: Bheemla Nayak: నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డ‌

ట్రెండింగ్ వార్తలు