August 25, 2022
సాధారణంగానే పూరి సినిమాలంటే కథ పెద్దగా ఉండదు..హీరో మ్యానరిజమ్స్, తనదైన మార్క్ డైలాగ్స్, మదర్ లేదా సిస్టర్ సెంటిమెంట్ వీటికి తోడు హీరోయిన్స్‌ని ఫుల్ గ్లామరస్ గా చూపించి ఏదో గారడి చేస్తుంటాడు. అయితే అవి కొన్ని సార్లు హద్దులు దాటుతాయి దాటాయి కూడా.. లేటెస్ట్ గా రిలీజైన లైగర్ సినిమాలో కూడా ఇదే జరిగింది. డైలాగ్స్, హీరో మ్యానరిజమ్స్ అంటే బోరు కొట్టిందో ఏమో అవి లేకుండా లైగర్ కథ రాసుకున్నాడు పూరి. దానికోసం అవసరం లేకున్నా హీరోకి నత్తిపెట్టి కొత్త మేనరిజమ్ ట్రై చేశాడు. దానివల్ల జెట్ స్పీడులో దూసుకుపోవాలనుకుంటున్న విజయ్ దేవరకొండకి సడెన్ బ్రేక్స్ పడ్డాయి. ఇప్పటికే వరుస ప్లాఫులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకి అన్నింటికి మించిన బిగ్గెస్ట్ ప్లాఫు కట్టబెట్టాడు. దాంతో విజయ్ ఈ సినిమాకోసం పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన కన్నీరు అయింది.
ముఖ్యంగా లైగర్ సినిమా క్లైమాక్స్ చూసి ఆడియన్స్ ఖంగుతిన్నారు. అంత పేలవంగా ఉంది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ దెబ్బకి పోస్టర్లో రేటింగ్స్ వేయాల్సిన స్థానంలో కేవలం ఆ వెబ్‌సైట్లు పాజిటివ్‌గా రాసిన ఒకటి రెండు పాయింట్స్ వేసుకువాల్సి వచ్చింది..పూరి సినిమా ఇంతలా దిగజారడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా కొందరైతే ఒకడుగు ముందరేసి పూరి కూడా మరో ఆర్జీవీ అయిపోతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తాడో లేదా ఎవరుఏమనుకున్నా తన ఫిలాసఫి తనదే అని అలానే ఉంటాడో..