Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య వివాహ వేడుక..భార్యతో కలిసి ఇటలీకి పయనమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్

October 28, 2023

Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య వివాహ వేడుక..భార్యతో కలిసి ఇటలీకి పయనమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Varun Tej-Lavanya Tripathi) పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. న‌వంబ‌రు 1న ఇటలీలోని టస్కానీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కొద్ది రోజుల క్రితం భార్య ఉపాసన, కూతురు క్లింకారతో ఇటలీ వెళ్లిన రామ్ చరణ్..తన సోదరుడి వివాహనికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక అక్టోబర్ 30 నుంచి మెహందీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీతోపాటు..లావణ్య కుటుంబ సభ్యులు.. సన్నిహితులు ఇటలీకి చేరుకున్నారు.

ఈ రోజు ఉద‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయ‌న స‌తీమ‌ణి ఇట‌లీకి ప‌య‌న‌మ‌య్యారు. రాజీవ్ గాంధీ ఇంట‌ర్‌నెష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లోని వీరి ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి ఇటలీ వెళ్లారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఇటలీకి వెళ్లనున్నారు. వీరిద్దరు తమ పెళ్లి వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మనీష్ డిజైనర్ స్టూడియోను సందర్శించిన వీడియో నెట్టింట వైరలయ్యింది. సెలబ్రెటీ స్టైలిస్ట్ లు అశ్విన్ మావ్లే, హసన్ ఖాన్ వీరి పెళ్లి వేదికను డిజైన్ చేయనున్నారు.

Read More: Thangalaan Release Date: తంగలాన్ రిలీజ్, టీజర్ డేట్ ఫిక్స్

ట్రెండింగ్ వార్తలు