దర్శకుల కెరీర్స్‌తో ఆడుకుంటున్న పవన్‌కళ్యాణ్‌

July 3, 2022

దర్శకుల కెరీర్స్‌తో ఆడుకుంటున్న పవన్‌కళ్యాణ్‌

‘హరిహర వీరమల్లు’..గుర్తుంది కదా! క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న సినిమా. ఏఎమ్‌ రత్నం నిర్మాత. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. రిలీజ్‌ మాట అటు ఉంచితే…అసలు.. ఈ సినిమా పూర్తి అవుతుందా? అనే సందేహాం ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్‌ టాపిక్‌. క్రిష్‌ చెప్పిన సెకండాఫ్‌ పవన్‌కళ్యాణ్‌కు నచ్చలేదట. దీంతో పవన్‌ ఈ ప్రాజెక్ట్‌కు కాస్త దూరం దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో క్రిష్‌ సందిగ్ధంలో పడ్డాడు. ఎన్టీఆర్‌ బయోపిక్, కొండపొలం సినిమాల తర్వాత క్రిష్‌ తీస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌ బయోపిక్, కొండపొలం ఫ్లాప్స్‌. సో.. హరిహర వీరమల్లు హిట్‌ అయితే మళ్లీ ఇండస్ట్రీలో క్రిష్‌ గురించి ఆడియన్స్‌ మాట్లాడుకుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్‌ హీరో పవన్‌ తీరు పై క్రిష్‌ అసహనంగా ఉన్నారు. అలా అనీ పవన్‌ వంటి పెద్దస్టార్‌ను విడిచి మరో సినిమా చేయడానికి సాహసం చేయలేకపోతున్నాడు క్రిష్‌.

ఇటు హరీశ్‌శంకర్‌ది సేమ్‌ కహానీ. పవన్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమాను ప్రకటించాడు హారీశ్‌ శంకర్‌. గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్, హారీశ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు. అయితే ఈ సినిమా కోసం హరీశ్‌ ఎప్పట్నుంచో వెయిట్‌ చేస్తున్నాడు. కానీ పవన్‌ మాత్రం ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టడం లేదు. మధ్యలో భీమ్లానాయక్‌ అనే సినిమా కూడా చేశారు కానీ భవదీయుడు భగత్‌సింగ్‌ని పవన్‌ పట్టించుకోవడం లేదు. నిర్మాతలు, దర్శకులతో మీటింగ్‌లు అయితే జరుగుతున్నాయి కానీ ఫలితంఉండటం లేదు. ప్రస్తుతం క్రిష్, హారీశ్‌ శంకర్‌ ప్రాజెక్ట్‌లను కాదని పవన్‌ కళ్యాణ్‌ తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్‌’ అనే తెలుగు రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సాయిధరమ్‌ ఓ హీరోగా నటించనున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. పవన్‌కల్యాణ్‌ సెట్స్‌పైకి వెళ్లనున్న నెక్ట్స్‌ మూవీ ఇదే. కానీ ఇండస్ట్రీలో మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్న క్రిష్, హరీశ్‌శంకర్‌లను పవన్‌ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్‌ కాదని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట..

ట్రెండింగ్ వార్తలు