April 9, 2024
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఎంఎం కీరవాణి సంగీత సారధ్యంలో చిరంజీవి త్రిష జంటగా వశిష్ట దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనులను శరవేగంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇలా ఈయన ఈ సినిమా షూటింగ్ పనులలో ఉండగా అక్కడకు తన సోదరులు నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఇలా ఈ ముగ్గురు ఒకే చోట కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా విశ్వంభర లోకేషన్ లో చిరంజీవితో కలిసి కొంత సమయం పాటు పలు విషయాలు గురించి చర్చలు జరిపారని తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల గురించి చిరంజీవితో చర్చించినట్టు తెలుస్తుంది.
ఇకపోతే చిరంజీవిని కలిసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఏకంగా ఐదు కోట్ల రూపాయల చెక్కును విరాళంగా పంపించారు తన తమ్ముడి పార్టీ కోసం చిరంజీవి ఇలా ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది. అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇలా తన తమ్ముడి పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడంతో తన తమ్ముడి పార్టీకి మద్దతు తెలపాలని చిరంజీవి తన అభిమానులకు చెప్పకనే చెప్పేశారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: అన్నా అంటూ అల్లు అర్జున్ కి విషెస్ చెప్పిన నిహారిక… ఫాన్స్ రియాక్షన్ ఇదే?