వదిన సురేఖ దగ్గర కూడా అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఎలక్షన్ అఫిడవిట్‌ వివరాలివే!

April 24, 2024

వదిన సురేఖ దగ్గర కూడా అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఎలక్షన్ అఫిడవిట్‌ వివరాలివే!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సినిమాలలో బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పవన్ కూడా తన పొలిటికల్ కాంపెయిన్ విషయంలో వేగం పెంచి ముందుకు కదులుతున్నారు. ఇక ఈ కాంపెయిన్ కోసం భారీ ఖర్చు అవుతుందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఖర్చులు కోసం పవన్ కళ్యాణ్ తన కుటుంబం, పలువురు నిర్మాతల నుంచి అప్పుగా కొంత డబ్బుని తీసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ డబ్బులను ఆ పార్టీ ఖర్చులకోసం ఉపయోగించారు.అయితే ఈ విషయాలు అన్నీ కూడా తాజాగా పవన్ దాఖలు చేసిన తన నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. నామినేషన్ తో పాటు తన ఆస్థుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ ని కూడా నామినేషన్ పత్రంలో పవన్ పొందిపరిచారు. ఆ అఫిడవిట్ లో పవన్ తన వదిన, చిరంజీవి భార్య సురేఖ దగ్గర కూడా అప్పు చేసినట్లు పేర్కొన్నారు.

సురేఖ కొణిదెల దగ్గర నుంచి రూ.2 కోట్లు లోన్ గా తీసుకున్నట్లు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మరికొందరు నుంచి కూడా పవన్ లోన్ గా కొంత అమౌంట్ ని తీసుకున్నారు. ఈ అమౌంట్ ని సినిమా అడ్వాన్స్ గా పరిగణించి, ఆ బ్యానర్స్ లో పవన్ మూవీ చేయనున్నారు. కాగా పవన్ ఇటీవల చిరంజీవి నుంచి కూడా ఐదు కోట్లు, అలాగే కొడుకు రామ్ చరణ్ ని కూడా పవన్ కి డొనేట్ చేయాలంటూ చిరంజీవి కోరారు. ఇప్పుడు భార్య సురేఖ కూడా పవన్ కి డబ్బుని ఇవ్వడం విశేషం. ఇక అఫిడవిట్ లో పవన్ తనకి ఉన్న వాహనాలు వివరాలను కూడా తెలియజేసారు. మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లు ఉన్నట్లు పవన్ తెలిపారు. అలాగే ఒక కాస్టలీ బైక్ అండ్ వ్యాన్ ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఈ అఫిడవిట్ లో వారాహి పేరుని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ అఫిడవిట్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: అతని పెళ్లి కోసం ఏకంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అతనెవరంటే!

ట్రెండింగ్ వార్తలు