ఈ బాధను మాటల్లో వర్ణించలేను.. నా గుండెకు ఇది మానని గాయం : పాయల్

January 6, 2024

ఈ బాధను మాటల్లో వర్ణించలేను.. నా గుండెకు ఇది మానని గాయం : పాయల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఇటీవల మంగళవారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇకపోతే తాజాగా తన పెట్ డాగ్ గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా పెట్ డాగ్స్ పెంచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. వీటిని స్వయంగా తన ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతూ ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు .అయితే వాటికి ఏమన్నా అయితే కనుక ఒక్కసారిగా గుండె పగిలినంత బాధ కలుగుతుందనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పాయల్ సైతం పెట్ డాగ్ ను ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్నారు. కానీ గత రాత్రి తన పెట్ చనిపోయింది అంటూ ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా తన పెట్ చనిపోవడంతో ఈమె తన హార్ట్ బ్రేక్ అయిందని తనకు మాటలు రావడం లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేశారు. తనకు ఇంతకుమించి మాట్లాడటానికి మాటలు రాలేదని ఇది నా గుండెకు మాయని గాయం అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక పాయల్ పోస్ట్ పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read More: హనుమాన్‌ను దారుణంగా తొక్కిన దిల్ రాజు.. ఇది మహా దారుణం

ట్రెండింగ్ వార్తలు